ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌కు రాఖీ కట్టిన మహిళా నాయకులు
ప్రజాపక్షం/వైరా: రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్‌కు పలువురు మహిళా నాయకులు ఆత్మీయంగా రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా సోదరభావాన్ని చాటింది.
వైరా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వీరంశెట్టి సీతారాములు సతీమణి భవానితో పాటు మహిళా సర్పంచులు భూక్య అనిత బాలు, భూక్య సునీత రామ్లా నాయక్, వైరా మండల బీజేపీ మహిళా నాయకులు ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌కు రాఖీలు కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ రాఖీ పౌర్ణమి కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, రక్షణకు ప్రతీకగా నిలిచే పవిత్రమైన బంధమని అన్నారు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా అందరూ కుటుంబ సభ్యుల్లా, సోదరభావంతో మెలగడం భారతీయ సంస్కృతిలోని గొప్పతనమని పేర్కొన్నారు. మహిళలు తనపై చూపిన ప్రేమాభిమానాలు ఎంతో ఆనందాన్ని కలిగించాయని ఎమ్మెల్యే తెలిపారు. వైరా నియోజకవర్గంలోని ప్రతి అక్కాచెల్లెమ్మకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.రాఖీలు కట్టిన మహిళా నాయకులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. వైరా నియోజకవర్గ ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి