కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన 32 వ వార్డు సిపిఐ కౌన్సిలర్ మామిండ్ల శ్రీనాథ్ రెడ్డి
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఎదులాపురం మున్సిపాలిటీ 32వ వార్డు పరిధిలోని సింహాద్రి నగర్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు 32వ వార్డు సిపిఐ కౌన్సిలర్ మామిండ్ల శ్రీనాథ్ రెడ్డి ఆదివారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. వార్డులో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని, సింహాద్రి నగర్లో సీసీ రోడ్డు నిర్మాణంతో కాలనీ ప్రజలకు రాకపోకల్లో మరింత సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు. మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 28వ వార్డు సిపిఐ కౌన్సిలర్ దండి రంగారావు, భారత కమ్యూనిస్టు పార్టీ 32వ వార్డు కార్యదర్శి మామిడి సుధర్శన్ రెడ్డి, AIYF జిల్లా సహాయ కార్యదర్శి గణపారపు ఉపేందర్, ఉపాధ్యక్షులు మామిడాల కిరణ్, యువజన సంఘం నాయకులు పొన్నం ఉమేష్ , కాలనీ వాసులు నిమ్మికంటి యుగంధర్, వల్లోజి సత్యనారాయణ, రావెళ్ల అశోక్, రాజగోపాల్ రెడ్డి, ధరణబోయిన వెంకటేశ్వర్లు, కటకం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق