ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఎర్రుపాలెం సరిహద్దు వద్ద వాహన తనిఖీలు: ఏసిపి సారంగపాణి


 ప్రజాపక్షం / ఎర్రుపాలెం: పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ఎర్రుపాలెం రింగ్ సెంటర్‌లోని అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. వైరా ఏసీపీ సారంగపాణి ఆధ్వర్యంలో మధిర రూరల్ సీఐ, మధిర టౌన్ సీఐ, వైరా సీఐ, సబ్‌ డివిజనల్ ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ సారంగపాణి వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లు, ఇతర వాహనాల్లో ప్రయాణించే వారు సీటు బెల్ట్ ధరించాలని సూచించారు. వాహనాలకు సంబంధించిన చెల్లుబాటు అయ్యే ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని ఏసీపీ సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రమాదాల నియంత్రణకు పోలీసులకు సహకరించాలని వాహనదారులను కోరారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم