చిన్నారి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి.. కుటుంబ సభ్యులకు పరామర్శ
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్ 28వ వార్డు షాబాద్ నగర్‌కు చెందిన *రంగిశెట్టి ఉదయ్, శ్రావణి దంపతుల కుమార్తె చిన్నారి వైదిక* ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. చిన్నారి మృతి విషయం తెలుసుకున్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి గౌ. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం రాత్రి వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. చిన్నారి వైదిక మృతి పట్ల మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. కన్నబిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులను ఓదార్చి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, వారికి ప్రభుత్వం, తనవంతుగా అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏదులాపురం మున్సిపాలిటీ ఛైర్పర్సన్ అనిత, కాంగ్రెస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు బానోతు కిషోర్ , స్థానిక నాయకులు నూకల రామ్మోహన్ రెడ్డి, భూక్యా సురేష్ నాయక్, వెంపటి రవి, వెంపటి వెంకన్న, షేక్ హుస్సేన్, కొట్టెం రంజిత్ రెడ్డి, ప్రదుమ్న చారి, రమేష్, ప్రభాకర్, దండి సుధాకర్, పొడేటి శ్రీనివాస్, కళ్లెం శేషి రెడ్డి, గుర్రం రాకేష్ రెడ్డి, మోహన్ రెడ్డి, శ్రీనివాస్, శివలింగం, అక్కినేపల్లి దేవయ్య, తోటకూర నాగేశ్వరరావు, మేళ్లచెర్వు సురేష్, వడ్లకోండ భుజంగరావు, ఏపూరి తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق