ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఏఐవైఎఫ్ అధ్యక్ష, కార్యదర్శుల ఏకగ్రీవ ఎన్నిక


 ప్రజాపక్షం/తిరుమలాయపాలెం :
మండలంలోని కాకరవాయి గ్రామంలో బుధవారం నిర్వహించిన ఏఐవైఎఫ్ మండల సమావేశంలో నూతన మండల అధ్యక్ష, కార్యదర్శులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏఐవైఎఫ్ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు మామిడాల కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల కార్యక్రమంలో మండల అధ్యక్షుడిగా భూక్య వినయ్, మండల కార్యదర్శిగా భూక్య విజయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులకు ఏఐవైఎఫ్ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. యువత సమస్యల పరిష్కారానికి, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు, విద్యార్థులు, యువజనుల హక్కుల సాధనకు కృషి చేస్తామని నూతన అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు. మండలంలో ఏఐవైఎఫ్‌ను మరింత బలోపేతం చేసి ప్రజా, యువజన సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم