ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

రాజీవ్ గృహకల్ప కాలనీ సమస్యలకు త్వరలో పరిష్కారం



 32 బ్లాకులకు కమిటీలు ఏర్పాటు చేయాలి: తుంబూరు దయాకర్ రెడ్డి

ప్రజాపక్షం/ఖమ్మంరూరల్ : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలతో రాజీవ్ గృహకల్ప లోని సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభించబోతున్నట్లు మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి తెలిపారు. బుధవారం ఎదులాపురం మున్సిపాలిటీ 2వ వార్డు పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుంబూరు దయాకర్ రెడ్డి మాట్లాడుతూ... కాలనీలోని 32 బ్లాకులకు ఒక్కో బ్లాక్‌కు అధ్యక్షుడిని ఎన్నుకుని కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. కమిటీలను ఏర్పాటు చేసి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి దృష్టికి కాలనీ సమస్యలను తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యంగా రాజీవ్ గృహకల్ప ఇళ్ల మరమ్మతులు, వాటర్ పైప్‌లైన్, సెప్టిక్ ట్యాంకుల మరమ్మతులు, ఇళ్లకు రంగులు వేయడం వంటి పనులను త్వరలో చేపట్టేందుకు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎదులాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ పోకబత్తిని అనిత, మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస రెడ్డి, హౌసింగ్ పీడీ శ్రీనివాస్, హౌసింగ్ డీఈ, 2వ వార్డు కౌన్సిలర్ ఏనుగు స్వరూప, మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు బానోతు కిషోర్, కాంగ్రెస్ యువజన నాయకుడు ఏనుగు మహేష్, పలువురు కౌన్సిలర్లు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم