ప్రజా పక్షం/ఖమ్మం/కొణిజర్ల : కొనిజర్ల మండలం, బాస్వాపురం గ్రామానికి చెందిన చెల్లి రమేష్ తన కుమార్తె చల్లా హేమశ్రీ అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనలో తమకు న్యాయం చేయాలని గురువారం జిల్లా కలెక్టర్ కుఈ వినతిపత్రాన్ని అందజేశారు.ఈ నేల 9 తన కుమార్తె చల్లా హేమశ్రీ అనారోగ్యానికి గురికావడంతో స్థానికంగా ఆర్ఎంపి మారుతి సంపత్ వద్దకు తీసుకెళ్లాము. ఆయన తన స్థాయికి మించి వైద్యం చేయడం, ఇంజక్షన్ ఇవ్వడం వల్లే నా కుమార్తె పరిస్థితి విషమించిందని , అనంతరం ఆమెను ఖమ్మంలోని వాత్సల్య ఆస్పత్రికి తరలించారు. అక్కడ నా కుమార్తె బతికే ఉందని మమ్మల్ని నమ్మించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారని, కొద్దిసేపటి అనంతరం ఆమె బ్రెయిన్‌డెడ్ అయి మృతి చెందినట్లు తమకు తెలిపారని, ఈ ఘటనతో తీవ్ర విషాదంలో ఉన్న మేము కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలతో కలిసి ఆస్పత్రికి వెళ్లి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశాము. అయితే ఆస్పత్రి వద్ద డాక్టర్ కే. ప్రదీప్ కుమార్ తన అనుచరులతో కలిసి వచ్చి తమను బెదిరించి, భయభ్రాంతులకు గురిచేశారని, తమపై దాడి చేసి దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నాను. నా కుమార్తె మృతిపై వివరాలు తెలుసుకునే అవకాశం లేకుండా చేశారని, ఆస్పత్రి యాజమాన్యం, డాక్టర్ కే. రాజ్ కుమార్, డ్యూటీ డాక్టర్ యక్కల నాగరాజు, మారుతి సంపత్ తదితరుల పాత్రపై సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నాను. నా కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలపై హాస్పిటల్ వారు తప్పుడు ఫిర్యాదులు చేసి తమను మరింత ఇబ్బందులకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొంటున్నారు. వాత్సల్య ఆస్పత్రికి అవసరమైన అనుమతులు, రిజిస్ట్రేషన్లు ఉన్నాయా? అక్కడ పనిచేస్తున్న వైద్యులకు చట్టబద్ధమైన అర్హతలు, అనుమతులు ఉన్నాయా? అనే అంశాలను సంబంధిత వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పరిశీలించాలని కోరుతున్నాను. నా కుమార్తె చల్లా హేమశ్రీ మృతి ఘటనపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరిపించాలి. చికిత్సలో నిర్లక్ష్యం లేదా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.ఆర్ఎంపీగా పనిచేస్తున్నారని చెప్పబడుతున్న మారుతి సంపత్ వైద్య సేవలపై విచారణ జరిపించాలి. వాత్సల్య ఆస్పత్రికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు, అనుమతులు, వైద్య సిబ్బంది అర్హతలను తనిఖీ చేయాలి. ఆస్పత్రి నిర్వహణలో నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు తేలితే చట్టప్రకారం ఆస్పత్రిపై చర్యలు తీసుకుని, అవసరమైతే సీజ్ చేయాలి. ఆస్పత్రి వద్ద తమపై దాడి, బెదిరింపులు జరిగాయన్న ఆరోపణలపై కూడా విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. నా కుటుంబానికి జరిగిన నష్టంపై చట్టప్రకారం న్యాయం, తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలి.నా కుమార్తె మృతి వెనుక అసలు కారణాలు వెలుగులోకి వచ్చి, బాధ్యులెవరైనా ఉంటే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. మా కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని చల్లా రమేష్ జిల్లా కలెక్టర్ దినకర్ కు వినాతి పత్రం అందజేశారు

إرسال تعليق