నిత్యావసర ధరలను వెంటనే నియంత్రించాలి: పమ్మి అశోక్
ప్రజాపక్షం/వైరా : దేశంలో నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకూ పెరుగుతూ సామాన్య ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి పమ్మి అశోక్ అన్నారు. పప్పులు, వంట నూనెలు, కూరగాయలు, చక్కెర తదితర నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ప్రతి కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు అచ్చే దిన్ వస్తాయని చెప్పి, ప్రస్తుతం ధరల భారంతో సామాన్యుడి నడ్డి విరుస్తోందని పమ్మి అశోక్ విమర్శించారు. నిత్యావసర ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.ధరల పెరుగుదలతో మధ్యతరగతి, పేద కుటుంబాల నెలవారీ బడ్జెట్‌లు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని తెలిపారు. ప్రజల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నిత్యావసర వస్తువుల ధరలను తక్షణమే నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని, సామాన్య ప్రజల గొంతుకగా నిలుస్తుందని పమ్మి అశోక్ స్పష్టం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి