ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

రెబ్బవరం గ్రామంలో సెరికల్చర్ పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం



ప్రజాపక్షం /వైరా: మేరా రేషమ్ మేరా అభిమాన్ 2.0 కార్యక్రమంలో భాగంగా కేంద్ర పట్టు మండలి, బెంగళూరు మరియు తెలంగాణ రాష్ట్ర సెరికల్చర్ శాఖ ఆధ్వర్యంలో వైరా మండలంలోని రెబ్బవరం గ్రామంలో పట్టు పురుగుల పెంపకంలో క్రిమిసంహారక చర్యలు మరియు పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 40 మంది పట్టు రైతులు పాల్గొన్నారు. కె. అనుసూయ, జాయింట్ డైరెక్టర్, తెలంగాణ రాష్ట్ర సెరికల్చర్ శాఖ, డా. జి. సుబ్రహ్మణ్యం, సీనియర్ సైంటిస్ట్, కేంద్ర పట్టు మండలి, బెంగళూరు పాల్గొని రైతులకు పట్టు పురుగుల పెంపకంలో పరిశుభ్రత, పెంపక గది మరియు పరికరాల క్రిమిసంహారక చర్యలు, వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. పట్టు పురుగుల వ్యాధులను నివారించేందుకు శాస్త్రీయ పద్ధతుల్లో క్రిమిసంహారక చర్యలు చేపట్టడం, పరిశుభ్రత పాటించడం మరియు సాంకేతిక సూచనలను అనుసరించడం ద్వారా ఆరోగ్యకరమైన పట్టు పురుగుల పెంపకంతో పాటు నాణ్యమైన ఉత్పత్తిని సాధించవచ్చని రైతులకు వివరించారు.


మేరా రేషమ్ మేరా అభిమాన్ 2.0 ద్వారా రైతులకు ఆధునిక సెరికల్చర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో అందించడమే లక్ష్యంగా ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

 

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم