ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

దాడి ఆరోపణలు అవాస్తవం: బట్టు రామారావు


రాజకీయ లబ్ధి కోసమే బీఆర్‌ఎస్‌ నేతల నిరాధార ఆరోపణలు

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: గూడూరుపాడులో బీఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహించిన విలేకరుల సమావేశంలో తనపై సీపీఐ నాయకుడు పుచ్చకాయల కమలాకర్‌ దాడి చేయించారని చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని బట్టు రామారావు తీవ్రంగా ఖండించారు. గురువారం సీపీఐ జిల్లా కార్యాలయానికి వచ్చిన ఆయన బీఆర్‌ఎస్‌ నేతల తీరుపై మండిపడ్డారు. రాజకీయంగా కావాలనే కమలాకర్ పై డబ్బు దాడి ఆరోపణలు చేశారన్నారు. రాజకీయంగా దెబ్బతీసేందుకే తప్ప ఎలాంటి ఆధారాలు లేకుండా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. తనపై వారి రాజకీయం కోసం చేసిన ఆరోపణలను వెంటనే నిరూపించాలని, లేనిపక్షంలో వాటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బట్టు రామారావు స్వయంగా వీడియో ద్వారా తన స్పందనను వెల్లడించారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم