సాంకేతిక పరిజ్ఞానంతో పాటు కమ్యూనికేషన్, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి
శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల ఓరియంటేషన్లో రిటైర్డ్ ఐఏఎస్ రాంపుల్లారెడ్డి
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాంపుల్లారెడ్డి సూచించారు. కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్‌తో పాటు సమస్య పరిష్కార సామర్థ్యం, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. శనివారం ఖమ్మం రూరల్ మండలంలోని పొన్నెకల్లు పంచాయతీలో గల శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులకు శనివారం ఓరియంటేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు ఉన్నత విద్య బలమైన పునాది అని అన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, నాణ్యమైన విద్యతో పాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించాల్సిన బాధ్యత కళాశాలపై ఉందన్నారు. కొత్తగా చేరిన విద్యార్థులు తమ విద్యా ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగించేందుకు అవసరమైన మార్గదర్శకత్వం అందించేందుకే ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
సాంకేతికతను సమాజ సేవకు వినియోగించాలి:
కళాశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని అన్నారు. పరిశోధనాత్మక దృక్పథాన్ని పెంపొందించుకుని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజ అభివృద్ధికి ఉపయోగించాలని సూచించారు.
పరిశోధన, ఆవిష్కరణలపై దృష్టి:
కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సాయి గీతిక మాట్లాడుతూ విద్యార్థులను కేవలం ఉద్యోగాలకు మాత్రమే సిద్ధం చేయకుండా పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించేలా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. జాతీయ విద్యా విధానం–2020 లక్ష్యాలకు అనుగుణంగా నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు. క్రమశిక్షణతో పాటు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు సూచించారు.
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం:
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జె. లక్ష్మీనారాయణ స్వాగతం పలుకుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి యాజమాన్యం, తల్లిదండ్రులు, అధ్యాపకులు సమన్వయంతో కృషి చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో, పట్టుదలతో చదివి తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు.
కళాశాల డైరెక్టర్ మల్లెంపాటి శ్రీ విద్య మాట్లాడుతూ విద్యార్థులు తమ ప్రొఫెషనల్ ప్రొఫైల్‌పై దృష్టి సారించాలని, కమ్యూనికేషన్, టెక్నికల్ స్కిల్స్‌ను పెంపొందించుకోవాలని సూచించారు. తరగతులకు క్రమం తప్పకుండా హాజరవుతూ కళాశాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కళాశాల డీన్ డాక్టర్ వి. సుదర్శన్ విద్యార్థులకు అందుబాటులో ఉన్న ల్యాబొరేటరీలు, శిక్షణా కార్యక్రమాలు, ప్లేస్మెంట్ అవకాశాలు తదితర అంశాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వైశాలి, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్, డిప్లొమా ఇన్చార్జి కృష్ణ ప్రసాద్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి