ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

బురద మడుగుగా మారిన కెవిసియం రోడ్డు



 రోడ్డుపై నాట్లు వేసి ప్రజల నిరసన

శంకుస్థాపన చేసి నెలలు గడిచినా పనులు ప్రారంభం కాలేదని ఆగ్రహం

రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్

ప్రజాపక్షం/వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని కెవిసియం రోడ్డు అధ్వానంగా మారి బురద మడుగును తలపిస్తోంది. వర్షం పడిన ప్రతిసారీ రోడ్డుపై నీరు నిలిచి బురదమయంగా మారడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాదచారులు నడవడానికి, వాహనదారులు రాకపోకలు సాగించడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్డు దుస్థితిపై నిరసనగా సీపీఎం పి.ఎస్–2 శాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ప్రజలు రోడ్డుపైనే నాట్లు వేసి వినూత్నంగా నిరసన తెలిపారు. బురదలో కూర్చొని తమ సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం మాట్లాడుతూ.. కెవిసియం రోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే 2026 జనవరి 4న శంకుస్థాపన చేసినప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభించకపోవడం తీవ్ర నిర్లక్ష్యమని విమర్శించారు. శంకుస్థాపన చేసి నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వర్షాకాలంలో రోడ్డుపై నీరు నిలిచి బురదగా మారడంతో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఇతర వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందన్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో సమస్య మరింత తీవ్రమవుతోందని పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కెవిసియం రోడ్డు నిర్మాణంతో పాటు డ్రైనేజీ పనులను తక్షణమే ప్రారంభించి పూర్తి చేయాలని భూక్యా వీరభద్రం డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోతే ప్రజలను సమీకరించి మరింత పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, వైరా పట్టణ నాయకులు గుడిమెట్ల మోహన్ రావు, కొంగర సుధాకర్, షేక్ నాగుల్ పాషా, మాడపాటి మల్లికార్జునరావు, మాడపాటి వెంకటేశ్వరరావు, రెచర్ల సైదులు, రామిని శ్రీనివాసరావు, రామిని ప్రశాంత్, బాడిస రమణయ్య, బాడిస రవి, తోట రాకేష్, తోట మంజుల, రాయల తిరపమ్మ, మణి తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم