ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో ముత్యాల నాగేశ్వరరావుకు రెండు అవార్డులు



 ప్రజాపక్షం /వైరా: రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో వైరాకు చెందిన ఫోటోగ్రాఫర్ ముత్యాల నాగేశ్వరరావు ప్రతిభ చాటారు. ఖమ్మం, జమ్మికుంటలో జరిగిన రెండు వేర్వేరు పోటీల్లో ఆయనకు రెండు అవార్డులు, నగదు బహుమతులు లభించాయి. అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా హెచ్.కె. ఆర్ట్ ఫోటోగ్రఫీ, ఖమ్మం జిల్లా ఫోటోగ్రఫీ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఫోటోగ్రాఫర్లతో నిర్వహించిన పోటీల్లో నాగేశ్వరరావు వైల్డ్‌లైఫ్ విభాగంలో ఉత్తమ అవార్డును అందుకున్నారు. ఈ పోటీల్లో రెండు రాష్ట్రాల నుంచి 500 మందికి పైగా ఫోటోగ్రాఫర్లు పాల్గొనగా, నాగేశ్వరరావు తీసిన ఫోటోకు అవార్డు దక్కడం విశేషం. ఖమ్మంలోని టీఎన్‌జీవోఎస్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో అడిషనల్ డీసీపీ అడ్మినిస్ట్రేషన్ బొజ్జా రామానుజం చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. అలాగే కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగిన రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో తెలంగాణ కల్చర్ విభాగంలో నాగేశ్వరరావుకు బెస్ట్ కన్సోలేషన్ అవార్డుతో పాటు నగదు బహుమతి లభించింది. జమ్మికుంట అసోసియేషన్ ముస్తఫా, ఆర్ట్ ఫోటోగ్రఫీ మెంటర్స్ అనిల్‌కుమార్ దేశ్‌పాండే, శివకుమార్, డా. నాగరాజు చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. గతంలోనూ నాగేశ్వరరావు జాతీయ, రాష్ట్రస్థాయిలో పలు అవార్డులు అందుకున్నారు. తాజాగా రెండు రాష్ట్రస్థాయి అవార్డులు రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు సాధించడమే తన లక్ష్యమని తెలిపారు. నాగేశ్వరరావుకు అవార్డులు రావడం పట్ల జిల్లా ఫోటోగ్రాఫర్లు, జమ్మికుంట మండల సీనియర్ ఫోటోగ్రాఫర్లు, జేఎంపీవీడబ్ల్యూఏ యూనియన్ సభ్యులు, కళాభిమానులు అభినందనలు తెలిపారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم