ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు


 ప్రజాపక్షం/ వైరా:యువజన కాంగ్రెస్ 65వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైరా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గరిడేపల్లి కిషోర్, వైరా మండల అధ్యక్షులు బొల్లం గోపీచంద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, యువ కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గరిడేపల్లి కిషోర్ మాట్లాడుతూ.. యువత దేశానికి వెన్నెముక అని, విద్యతో పాటు సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో యువత క్రియాశీలకంగా పాల్గొనాలని, ప్రజాసేవ, రాజకీయాల్లోకి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వైరా నియోజకవర్గంలో యువజన కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసి, యువతను ప్రజాసేవ వైపు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు.కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా నాయకులు వేముల శ్రీనాథ్, యువజన కాంగ్రెస్ నాయకులు వేముల కార్తీక్, పఠాన్ జాన్ పాషా, దుగ్గిరాల రాజేష్, ప్రేమ్, నితిన్, సాయి ఆర్సీ, రామ్‌చరణ్, వల్లెపు మహేష్, చక్రి, నాని, బత్తుల సాయి, రాకేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

1 تعليقات

إرسال تعليق

Post a Comment

أحدث أقدم