నిఖిత ఎంపిక పట్ల సంబరాలు
మిస్ యూనివర్స్ పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన మాదినేని దంపతుల కుమార్తె నిఖిత
ప్రజాపక్షం/ వైరా: విదేశీ గడ్డపై మిస్ యూనివర్స్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి వైరా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన మాదినేని ప్రసాద్–సునీత దంపతుల కుమార్తె నికిత విజయాన్ని పురస్కరించుకొని వైరాలో ఆదివారం సంబరాలు నిర్వహించారు. వైరా మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో కౌన్సిలర్ కట్టా స్వరూప రాణి–కృష్ణార్జునరావు దంపతుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి నికిత విజయాన్ని వేడుకగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా సీనియర్ నాయకులు వనమా విశ్వేశ్వరరావు, బాణాల వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడుతూ.. వైరాకు చెందిన యువతి విదేశీ వేదికపై ప్రతిభను చాటడం గర్వకారణమన్నారు. నికిత సాధించిన విజయం యువతకు స్ఫూర్తిదాయకమని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
బిఆర్ఎస్ జిల్లా నాయకులు కట్ట కృష్ణార్జునరావు మాట్లాడుతూ చదువు కోసం ఐర్లాండ్ వెళ్లిన నికిత అక్కడి వాతావరణానికి అలవాటు పడుతూ విద్యాభ్యాసంతో పాటు ఉద్యోగం కొనసాగిస్తూనే మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. ఎలాంటి ప్రత్యేక అవగాహన లేకుండా తొలిసారే పోటీలో పాల్గొని ప్రథమ స్థానాన్ని సాధించడం ఆమె ప్రతిభకు నిదర్శనమన్నారు.
నికిత విజయం తెలంగాణ రాష్ట్రంతో పాటు ఖమ్మం జిల్లా, వైరా పట్టణానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిందని అన్నారు. కష్టపడి సాధించాలనే పట్టుదల ఉంటే ఎలాంటి రంగంలోనైనా విజయాన్ని అందుకోవచ్చని నికిత నిరూపించారని పేర్కొన్నారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి వైరా పేరును ప్రపంచస్థాయిలో మరింతగా చాటాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చిలక కోటయ్య పెరుమల కృష్ణమూర్తి, మిట్టపల్లి సత్యంబాబు గొల్ల రాంబాబు, కామినేని శ్రీనివాసరావు, ఏదునూరు శ్రీనివాసరావు, కులాసాగరం నరేష్ నారపోగు కిరణ్ గోపి, రంగా సత్యనారాయణ పుప్పాల అనంతరామయ్య మడిపల్లి కృష్ణ రాణి రాజేష్, ముదిగొండ పుల్లయ్య , మాది నేను లక్ష్మణ్ నల్లమోతు లక్ష్మీనారాయణ నేరెళ్ల శ్రీనివాసరావు రాయపూడి వెంకటేష్, బొడ్డు రామకృష్ణ,నూకుల ప్రసాద్, నూకల అన్నపూర్ణ ,రాయపూడి రజిని, సుగ్గల మాధవి, రంగా వాసవి, మాదిని నాగరాణి నాగ రాణి, మిట్టపల్లి సుద,పొడపాటి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు


إرسال تعليق