ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

తుంబూరి దయాకర్‌రెడ్డి చొరవతో విద్యుత్‌ వోల్టేజ్‌ సమస్యకు చెక్‌


 ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ 29వ వార్డు అయోధ్యనగర్‌ రోడ్‌ నంబర్‌–4, శ్రీరాంనగర్‌ R-11 ప్రాంతాల్లో నెలకొన్న విద్యుత్‌ వోల్టేజ్‌ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జ్‌ తుంబూరి దయాకర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన చొరవతో సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు దయాకర్‌రెడ్డి సమస్యను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి ఆదేశాలతో విద్యుత్‌ శాఖ అధికారులు అవసరమైన చర్యలు చేపట్టి, గతంలో 60 వోల్టేజ్‌ సామర్థ్యంతో ఉన్న విద్యుత్‌ వ్యవస్థను 100 వోల్టేజ్‌ సామర్థ్యానికి పెంచేలా ఏర్పాట్లు చేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో చాలాకాలంగా వేధిస్తున్న లో-వోల్టేజ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లు స్థానికులు తెలిపారు. విద్యుత్‌ వోల్టేజ్‌ సమస్య పరిష్కారం కావడంతో అయోధ్యనగర్‌, శ్రీరాంనగర్‌ కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జ్‌ తుంబూరి దయాకర్‌రెడ్డికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు వెంపటి రవి, విద్యుత్‌ శాఖ సిబ్బంది, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది