ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ప్రజాపక్షం కథనానికి తక్షణ స్పందన...



27వ వార్డులో మురుగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు

చైర్‌పర్సన్, కమిషనర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన శానిటేషన్ విభాగం

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్:ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డులో మున్సిపాలిటీ కార్యాలయం వెనుక అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లే మార్గంలో నెలకొన్న తీవ్ర మురుగునీటి సమస్యపై ప్రజాపక్షం వెబ్లో ప్రచురితమైన కథనానికి మున్సిపల్ యంత్రాంగం తక్షణమే స్పందించింది. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కథనం ద్వారా వెలుగులోకి తీసుకురాగానే మున్సిపల్ చైర్‌పర్సన్ పోకబత్తిని అనిత సూచనలతో కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఆదేశాల మేరకు శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ వీరన్న పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి ట్రాక్టర్‌ను ఘటనాస్థలానికి తరలించి, పేరుకుపోయిన మురుగు, చెత్తను తొలగించే పనులను చేపట్టారు. దీంతో చాలా రోజులుగా దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్న స్థానికులకు ఊరట లభించింది. మురుగునీటి నిల్వ తగ్గడంతో రాకపోకలు కూడా కొంత మేర సులభతరమయ్యాయి.కేవలం తాత్కాలిక చర్యలకే పరిమితం కాకుండా, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అధికారులు చర్యలు ప్రారంభించారు. మురుగునీరు నిల్వ కాకుండా డ్రెయిన్ నిర్మాణంతో పాటు అవసరమైన చోట కొత్త పైప్‌లైన్ ఏర్పాటు చేయనున్నట్లు శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ వీరన్న తెలిపారు. పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.ఈ ప్రాంతంలో మురుగునీరు నిల్వ ఉండటంతో పాదచారులు, మహిళలు, వృద్ధులు, అంగన్‌వాడీకి వచ్చే చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు. వర్షం పడిన ప్రతిసారీ పరిస్థితి మరింత దారుణంగా మారి దోమల వ్యాప్తి, దుర్వాసన, అపరిశుభ్ర వాతావరణంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజల సమస్యను సకాలంలో వెలుగులోకి తీసుకొచ్చిన ప్రజాపక్షంకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలను మీడియా బాధ్యతగా ప్రస్తావిస్తే అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటారనే నమ్మకం మరింత బలపడిందని పేర్కొన్నారు. ఇదే తరహాలో మున్సిపాలిటీ పరిధిలోని ఇతర వార్డుల్లో ఉన్న సమస్యలను కూడా గుర్తించి శాశ్వత పరిష్కారాలు చూపించాలని ప్రజలు కోరుతున్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم