ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి

మంత్రి పొంగులేటికి సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ వినతి

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ప్రభుత్వం వెంటనే స్థలాలు కేటాయించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ కోరారు.ఈ మేరకు బుధవారం పల్లెగూడెం మున్సిపాలిటీ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దండి సురేష్ మాట్లాడుతూ.. ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో అనేక మంది పేదలు సొంత ఇంటి స్థలం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఇళ్ల స్థలాలు లేకపోవడంతో ఒకే గదిలో మూడు, నాలుగు కుటుంబాలు కలిసి జీవించాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. నిరుపేద కుటుంబాల ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ప్రత్యేకంగా స్థలాలను గుర్తించి అర్హులైన పేదలకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.పేదలకు సొంత ఇంటి కలను సాకారం చేయడంలో భాగంగా ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని కోరారు. దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, వినతిపత్రాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా తన సహాయకునికి సూచించారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم