ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి


జేఎన్టీయూ కళాశాల వంటశాలను పరిశీలించిన యువజన కాంగ్రెస్ నేత అంబటి ఈశ్వర్

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఆహారాన్ని నాణ్యతా ప్రమాణాలతో అందించాలని ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ అంబటి ఈశ్వర్ సూచించారు. ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లిలో ఉన్న జేఎన్టీయూ కళాశాల వంటశాలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న భోజన సౌకర్యాలు, వంటశాల పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అందిస్తున్న ఆహారాన్ని నాణ్యతతో, పరిశుభ్రంగా అందించాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందేలా నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అంబటి ఈశ్వర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ అనుబంధ సంఘమైన ఏఐవైఎఫ్ సభ్యుడు చింతల ఉదయ్ పాల్గొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم