ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఘనంగా కాంగ్రెస్ నాయకుడు రాయల రాము జన్మదిన వేడుకలు



 ప్రజాపక్షం /తల్లాడ: ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు రాయల రాము జన్మదిన వేడుకలను తల్లాడ, వైరా, కొణిజర్ల మండలాల్లో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా మండలాల్లో కేక్ కట్ చేసి, బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. రాయల రాము నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి మరింతగా కృషి చేయాలని అభిమానులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాయల రాము మాట్లాడుతూ ప్రజలు తనపై చూపుతున్న అభిమానాన్ని ఎన్నటికీ వమ్ము చేయనని, నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతోందని, మరింత అభివృద్ధి సాధించేలా ఎమ్మెల్యే సహకారంతో ముందుకు సాగుతానన్నారు. వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. తన జన్మదిన వేడుకల్లో రాజకీయాలకు అతీతంగా పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ రాయల రాము కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైరా మున్సిపల్ వైస్ చైర్మన్ కట్ల సంతోష్, చెరుకూరి కిరణ్, కోసూరు శీను, తుమ్మలపల్లి రమేష్, రాయల పుల్లయ్య, ఏదునూరి శ్రీను, పొదిల అరుణ, నిధి సాఫ్ట్వేర్ ఇన్‌స్టిట్యూట్ నిర్వాహకుడు ఉప్పల చారి, కర్నాటి హనుమంతరావు , దగ్గుల శ్రీనివాస్ రెడ్డి, అయినాల నరసింహారావు తో పాటు తల్లాడ, కొణిజర్ల, వైరా మండలాలకు చెందిన రాయల రాము అభిమానులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది