స్వాతంత్ర దినోత్సవం వేడుక ఘనంగా ఘనంగా నిర్వహణ
జాతీయ జెండా ఆవిష్కరించిన
గ్రామ సర్పంచ్ కుక్కల నరేష్
ప్రజాపక్షం/నేలకొండపల్లి : 80 వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పైనంపల్లి గ్రామంలో కల్వరి ప్రార్థన మందిరం లో నేలకొండపల్లి పాస్టర్ ఫెలోషిప్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాస్టర్స్, గ్రామ పెద్దలు,గ్రామ పాలకవర్గ సభ్యులు మధ్య గ్రామ సర్పంచ్ కుక్కల నరేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మండలంలోని 32 గ్రామాల్లో దేవుని పరిచర్య చేస్తున్న పాస్టర్స్ ఇలా ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం వేడుక జరపటం సంతోషం అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి పాస్టర్ ను అభినందించారు. కార్యక్రమం అనంతరం స్వీట్స్,బిస్కెట్స్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గం పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడు బీవీ రత్నం,ఉపాధ్యక్షుడు వడ్లమూడి డేవిడ్ రాజ్, మండల అధ్యక్షుడు పాస్టర్ బి యాకోబు రాజు,మండల ఫెలోషిప్ ట్రెజరర్ పాస్టర్ సూరేపల్లి సుందర్ పాల్, గౌరవ అధ్యక్షులు కే ప్రసంగి, పాస్టర్స్ ఎస్. నాగేశ్వరరావు,పాస్టర్ వై ప్రకాష్,యూ.ఏ షేపు, స్థానిక సంఘ సభ్యులు,గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


إرسال تعليق