మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్ దయాకర్‌రెడ్డి సమక్షంలో
కమిటీ ఇన్చార్జ్ కీలార్ వెంకటనారాయణ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఏర్పాటు
ప్రజాపక్షం/ఖమ్మం అర్బన్: ఏదులాపురం మున్సిపాలిటీ కాంగ్రెస్ కమిటీ ఎన్నిక మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్ తుంబురు దయాకర్‌రెడ్డి సమక్షంలో, కాంగ్రెస్ జిల్లా నాయకుడు, మున్సిపాలిటీ కమిటీ ఇన్చార్జ్ కీలార్ వెంకటనారాయణ ఆధ్వర్యంలో నూతన కమిటీని ప్రతిపాదించి డిసిసికి పంపించినట్లు సమాచారం. నూతన మున్సిపాలిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బానోత్ కిషోర్ నాయక్, ఉపాధ్యక్షులుగా గోనే భుజంగారెడ్డి, వెంపటి సురేష్ పేర్లు. జనరల్ సెక్రటరీలుగా కందుకూరి వెంకట నారాయణ, చిదుముల వెంకటరెడ్డి, గణపరపు వీరన్న, పేరా శ్రీనివాసరావు పేర్లు. సెక్రటరీలుగా వెలుగు సుధాకర్, రంగారావు, అరెంపుల జ్యోతి, కొండపల్లి నాగ సంతోషి, జమ్మలమడుగు దాస్, భూక్య సర్వర్సింగ్ పేర్లు. ట్రెజరర్‌గా బాబూరి శ్రీనివాసరావు తో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా కుర్రి హస్సాన్, ధరావత్ కృష్ణ, షేక్ గౌస్, ధర్మసోత్ దీప, చంద్రగిరి నాగేష్, బుక్కరాజు లక్ష్మి, ఉండేటి కృష్ణల ను జాబితాలో చేర్చారు. ఈ సందర్భంగా నూతన కమిటీ ఏర్పడబోయే సభ్యులను దయాకర్‌రెడ్డి, కీలార్ వెంకటనారాయణ అభినందించారు. మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నూతన కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.


إرسال تعليق