ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

డివైండర్ డీకొని... క్యాబిన్ పై పడ్డ గ్రానైట్ బండ క్యాబిన్ లో ఇరుకున్న డ్రైవర్ తీవ్ర గాయాలతో బయటపడ్డ వైనం


 ప్రజాపక్షం /నేలకొండపల్లి:  గ్రానైట్ రాళ్ల తో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు డివైండర్ ను డీకొనటంతో ప్రమాదం జరిగింది. డ్రైవర్ కు తీవ్ర గాయాలైయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం తెల్లవారు జామున నేలకొండపల్లి నుంచి ఖమ్మం వెళ్తున్న గ్రానైట్ లారీ కి ప్రమాదం జరిగింది. నేలకొండపల్లి మండలం లోని గువ్వలగూడెం- ముదిగొండ మండలం లోని గోకినేపల్లి గ్రామాల మధ్య జాతీయ రహదారి పై లారీ ప్రమాదవశాత్తు డివైండర్ ను ఢీకొట్టింది. దీంతో గ్రానైట్ రాళ్లు క్యాబిన్ పై పడటంతో డ్రైవర్ నాగరాజు క్యాబిన్ లో ఇరుక్కున్నారు. సమాచారం అందుకున్న నేషనల్ హైవే సిబ్బంది ఘటనా స్థలం కు చేరుకుని క్యాబిన్అద్దాలను పగలగొట్టి డ్రైవర్ ను సురక్షితంగా బయటకు తీశారు. తీవ్ర గాయాలైన డ్రైవర్ ను చికిత్స కోసం ఖమ్మం తరలించారు. టైర్ పంక్షర్ కావటం వలన డివైండర్ ను డికొట్టినట్లు సమాచారం. ఈప్రాంతంలో అధిక లోడు తో గ్రానైట్ వాహానాలు తిరగటం, అతి వేగంగా నడపటం వలన ఇటీవల అనేక ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవటం లేదనే విమర్శలు వినవస్తున్నాయి.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم