ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

3వ వార్డులో ఘనంగా పోషణ మహా కార్యక్రమం

 

ప్రజాపక్ష/ ఖమ్మం రూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మూడవ వార్డులోని ఒకటి, రెండు, మూడు అంగన్వాడి కేంద్రాలలో శనివారం పోషణ మహా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కౌన్సిలర్ కొమరగిరి సత్యవతి ముఖ్యఅతిథిగా హాజరై పోషక ఆహార పదార్థాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అలాగే అంగన్వాడి కేంద్రాల ఆధ్వర్యంలో గుడ్లు ,పప్పు దినుసులు ,ఆకుకూరలు, పాలు, పాలపదార్థాలు, రాగులు, రజమ, సెనగలు, చిరుధాన్యాలు తదితర ఆహార పదార్థాలను ప్రదర్శించి వాటిలో ఉండే ప్రోటీన్లు పోషక విలువలపై అవగాహన కల్పించారు. అనంతరం పోషణ మాసం సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ మాలతి కుమారి, ఏఎన్ఎం అనురాధ, అంగన్వాడీ టీచర్లు విజయలక్ష్మి, పి.సరోజినీ, పి. సరితా బాయ్, ఆశ కార్యకర్తలు సుజాత, పుల్లమ్మ , ఆర్పీలు హెచ్ వెంకటలక్ష్మి, పి.స్వరూప, గర్భిణీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم