ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

బీమాతో కుటుంబానికి ఆర్థిక భరోసా


యర్రనాగుల వీరన్న కుటుంబానికి రూ.6.60 లక్షల డెత్‌ క్లెయిమ్‌ చెక్కు అందజేత

స్థానిక సర్పంచ్ హలవత్ వీరయ్య చేతుల మీదుగా పంపిణీ

ప్రజాపక్షం /కూసుమంచి: కుటుంబానికి ఆపద సమయంలో జీవిత బీమా ఆర్థిక భరోసాగా నిలుస్తుందని శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఖమ్మం బ్రాంచ్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఆధ్వర్యంలో పాలసీదారు యర్రనాగుల వీరన్న కుటుంబానికి రూ.6.60 లక్షల డెత్‌ క్లెయిమ్‌ బీమా చెక్కును అందజేశారు. నామినీ యర్రనాగుల నందినికి స్థానిక సర్పంచ్‌ హలవత్‌ వీరయ్య, కోక్య తండా మాజీ సర్పంచ్‌ తేజావత్‌ మోహన్‌ నాయక్,లోక్య తండా మాజీ ఎంపిటిసి జర్పుల బాలాజీ నాయక్ ల చేతుల మీదుగా చెక్కును అందించారు. కోక్య తండాకు చెందిన యర్రనాగుల వీరన్న శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో పీఏబీ ప్లాన్‌ కింద పాలసీ తీసుకున్నారు. పాలసీకి సంబంధించిన ప్రీమియంగా రూ.63,060 చెల్లించినట్లు సంస్థ వివరించింది. పాలసీదారు మృతిచెందడంతో నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యులకు డెత్‌ క్లెయిమ్‌ మొత్తం రూ.6,60,000 మంజూరైంది. ఈ మొత్తాన్ని నామినీకి అందజేయడంతో కుటుంబానికి ఆర్థికంగా కొంత ఊరట లభించినట్లయింది.

కుటుంబ రక్షణకు జీవిత బీమా...

కుటుంబ పెద్దను కోల్పోయిన సమయంలో ఆదాయ వనరు దెబ్బతినకుండా జీవిత బీమా రక్షణ కల్పిస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. నేటి భద్రతే రేపటి భరోసా అనే లక్ష్యంతో కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించడమే తమ ఉద్దేశమన్నారు. బీమా పాలసీలపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ సురేష్, సంస్థ ప్రతినిధులు రాజబోయిన భరత్ కుమార్, గంగుల సతీష్,గ్రామస్థులు పాల్గొన్నారు. పాలసీదారు కుటుంబానికి వారు సానుభూతి తెలిపారు.

ఆపద సమయంలో అండగా...

జీవిత బీమా కేవలం పెట్టుబడి మాత్రమే కాకుండా కుటుంబానికి రక్షణ కవచంగా పనిచేస్తుందని, అనుకోని పరిణామాల్లో కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రత కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుందని కార్యక్రమంలో పేర్కొన్నారు. బీమా పట్ల ప్రతి కుటుంబం అవగాహన పెంచుకుని తమ ఆర్థిక స్థితికి అనుగుణంగా రక్షణ పొందాలని సూచించారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم