ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

7వ వార్డులో రూ.62 వేల ఐదు వందల ధర పలికిన లడ్డు



 శ్రీ సత్య సంకల్ప టౌన్‌షిప్‌లో ఘనంగా ముగిసిన నిమజ్జన వేడుకలు

ప్రజాపక్షం/ ఖమ్మం రూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డు గుర్రాలపాడు శ్రీ సత్య సంకల్ప టౌన్‌షిప్‌లో 5వ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మహా ప్రసాద లడ్డు వేలం పాటలో శ్రీ గుగులోత్ చరణ్ ప్రీత్ సింగ్ కుటుంబ సభ్యులు రూ.62,500కు లడ్డును దక్కించుకున్నారు. అదేవిధంగా పట్టువస్త్రాలను పచ్వా నాగమణి రూ.21,500కు వేలంలో దక్కించుకున్నారు. ఐదు రోజుల పాటు ప్రత్యేకంగా పూజించిన పూజాఫలాన్ని కుంచెం ముత్తయ్య రూ.4,000కు దక్కించుకున్నారు.అలాగే చెరకు గడను గౌస్ రూ.500కు వేలంలో దక్కించుకున్నారు. ఈ కార్యక్రమాన్నిి కాంగ్రెస్ కౌన్సిలర్ బుర్ర మహేష్ ఆధ్వర్యంలోో చేపట్టారు. భక్తులు, టౌన్‌షిప్‌ వాసులు ఉత్సాహంగా పాల్గొనడంతో వేలం కార్యక్రమం సందడిగా సాగింది. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు వేలంలో పాల్గొన్న భక్తులకు, దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم