ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఆరు గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలి


 బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం.. సూర్యాపేట రహదారిపై రాస్తారోకో

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఖమ్మం రూరల్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అదేవిధంగా రాష్ట్ర బీఆర్‌ఎస్‌ పార్టీ పిలుపు మేరకు నిన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై నమోదైన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ సూర్యాపేట రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ఖమ్మం రూరల్‌ మండల పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్‌, గూడా సంజీవరెడ్డి, బానోతు కృష్ణ, మట్ట వెంకటేశ్వర్లు, మైబల్ సాబ్, రెడ్యా నాయక్, నల్లపునేని రమణయ్య , భార్గవ్, అక్కినపల్లి వెంకన్న, పాటు రూరల్‌ మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది