ఉత్సవ మూర్తులకు ఘనంగా కళ్యాణం
కోలాహలంగా ఊరేగింపు
ప్రజాపక్షం/ఖమ్మం : ఖమ్మం నగరం బైపాస్ రోడ్ల గల తారకరామా ఆటోనగర్‌లో ఫోర్ వీలర్స్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రుల్లో భాగంగా వరసిద్ధి వినాయక కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉత్సవ మూర్తులకు పంచామృత అభిషేకం అనంతరం పుణ్యాహవచనం, పంచగవ్య , కళ్యాణ మహోత్సవం, కనులు పండుగ నిర్వహించడం జరిగింది అనంతరం వేద ఆశీర్వనంతరం తీర్థ ప్రసాదాలు భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు మహంకాళి మల్లికార్జునరావు, కేశగాని రవి, కనకం రామకృష్ణ, భానోత్ రాందాస్ నాయక్, గుజ్జుల వెంకట్ రెడ్డి, మట్టా భీమయ్య, కొనకటి శామందర్ రెడ్డి, గంగవరపు శ్రీనివాసరావు, పబ్బు భాస్కర్, మహంకాళి మహేష్, ఫోర్ వీలర్స్ టెక్నీషియన్ సభ్యులు , గణపతి మాలధారించిన స్వాములు పెద్ద ఎత్తున మహిళలు భక్తులు పాల్గొన్నారు పాల్గొన్నారు


కామెంట్‌ను పోస్ట్ చేయండి