ప్రజలకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించి, విజయాలను అందించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రజలంతా భక్తిశ్రద్ధలతో వినాయక చవితిని జరుపుకోవాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించాలని మంత్రి సూచించారు. గణనాథుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి