ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

పాలేరు రైతులకు నీటి భరోసా.. మంత్రికి కృతజ్ఞతలు



 

జిల్లా నాయకుడు జొన్నలగడ్డ రవి కుమార్, మాజీ ఎంపీపీ జుకూరి


 ప్రజాపక్షం /  కూసుమంచి: పాలేరు నియోజకవర్గ రైతుల పంటలను కాపాడేందుకు సాగునీటిని విడుదల చేసి అండగా నిలిచిన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డికి కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రిని, ఎంపీని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జొన్నలగడ్డ రవికుమార్, కూసుమంచి మండల మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాలేరు నియోజకవర్గ రైతుల తరఫున వారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల రైతుల పంటలకు నీటి కొరత ఏర్పడిన సమయంలో పాలేరు పాత కాల్వకు నీటిని విడుదల చేయడంతో పాటు భక్త రామదాసు ప్రాజెక్టు ద్వారా కూసుమంచి మండలంలోని వివిధ గ్రామాల చెరువులకు నీటిని విడుదల చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించి నీటిని అందించడం వల్ల రైతుల పంటలను కాపాడేందుకు ఎంతో ప్రయోజనం కలిగిందని పేర్కొన్నారు. రైతుల సమస్యలను గుర్తించి సకాలంలో నీటిని విడుదల చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డికి రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم