ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

'సర్‌'తో సతమతం.. ఓటు హక్కు కోసం ప్రజల పాట్లు


 23 వేల నోటీసులతో పెరిగిన ఇబ్బందులు

ఆధారాల కోసం వృద్ధుల అవస్థలు.. దరఖాస్తులు తిరిగి రావడంతో తిప్పలు

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: అర్హులైన పౌరులందరికీ ఓటు హక్కు ఉండేలా.. అనర్హుల పేర్లు ఓటర్ల జాబితాలో లేకుండా చూడాలనే లక్ష్యంతో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ (SIR) ప్రక్రియ కొందరు ఓటర్లకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. SIRపై అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించినప్పటికీ.. సమర్పించిన దరఖాస్తుల్లో ఆధారాలు, వివరాల్లో తేడాలు ఉండటంతో తిరిగి వచ్చిన ఫారాలను సరిచేసుకునేందుకు ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది.

23 వేల నోటీసులు జారీ..

ఖమ్మం రూరల్ మండలంతో పాటు ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో కలిపి సుమారు 23 వేల నోటీసులు జారీ అయినట్లు అధికారులు తెలిపారు. మ్యాపింగ్‌లో తేడాలు, పేర్లలో మార్పులు, ఇతర వివరాల్లో లోపాల కారణంగా కొన్ని దరఖాస్తులు తిరిగి వచ్చినట్లు సంబంధిత ఎన్నికల అధికారులు వెల్లడించారు. గుర్తించిన లోపాలను పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కరిస్తామని తెలిపారు.

ఆధారాల కోసం వృద్ధుల అవస్థలు..

SIRలో సమర్పించిన ఫారాల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించి తిరిగి పంపడంతో వాటిని సరిచేసుకునేందుకు ఓటర్లు మళ్లీ ప్రక్రియను పూర్తి చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా వృద్ధులకు అవసరమైన ధ్రువపత్రాలు సమకూర్చుకోవడం ఇబ్బందిగా మారుతోంది. ధ్రువీకరణ పత్రాల కోసం రెవెన్యూ కార్యాలయాలను ఆశ్రయించాల్సి రావడంతో వృద్ధులు అవస్థలు పడుతున్నట్లు తెలుస్తోంది.

ఓసీలకు మరో సమస్య..

ఓసీ వర్గాలకు కుల ధ్రువీకరణ పత్రం ఉండకపోవడంతో, SIRలో అవసరమైన ఇతర ఆధారాలను సమర్పించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రం అవసరమయ్యే వారికి దానిని పొందేందుకు రెవెన్యూ కార్యాలయంలో కొంత సమయం పడుతోందని స్థానికులు చెబుతున్నారు. దీంతో గడువులోగా అవసరమైన పత్రాలు సమర్పించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవైపు ఓటర్ల జాబితాను సక్రమంగా రూపొందించేందుకు SIR ప్రక్రియ కొనసాగుతుండగా.. మరోవైపు దరఖాస్తులు తిరిగి వస్తున్న సందర్భాల్లో ప్రజలకు సరైన మార్గదర్శకత్వం, అవసరమైన పత్రాలపై స్పష్టమైన అవగాహన కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم