ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం.. నాయకన్‌గూడెం బ్రిడ్జి రోడ్డు !


 

వర్షం వస్తే చాలు.. సర్వీస్‌ రోడ్డు జలమయం


ఐదేళ్లుగా ఇదే తంతు.. పట్టించుకోని జాతీయ రహదారి అధికారులు


వాహనదారుల తీవ్ర ఇబ్బందులు.. శాశ్వత పరిష్కారం ఎప్పుడు?


 ప్రజాపక్షం/కూసుమంచి:  జాతీయ రహదారి అధికారుల నిర్లక్ష్యానికి కూసుమంచి మండలంలోని నాయకన్‌గూడెం బ్రిడ్జి కింద నిలిచిన వర్షపు నీరే నిదర్శనమని వాహనదారులు, స్థానికులు ఆరోపిస్తున్నారు.2021లో సూర్యాపేట నుండి ఖమ్మం వరకు పూర్తయిన జాతీయ రహదారి 58 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయి సుమారు 5 సంవత్సరాలు గడిచినా.. వర్షం వచ్చిన ప్రతిసారీ బ్రిడ్జి కింద సర్వీస్‌ రోడ్డు జలమయం కావడం అధికారుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. సెప్టెంబర్‌ 23 రాత్రి నుంచి 24వ తేదీ మధ్యాహ్నం వరకు కురిసిన వర్షానికి నాయకన్‌గూడెం బ్రిడ్జి కింద రెండు వైపులా ఉన్న సర్వీస్‌ రోడ్లపై పెద్దఎత్తున నీరు నిలిచిపోయింది. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే రాజుపేట ఈశ్వర్ మాదారం మంగళ్ తండా రామచంద్రపురం వైపు వెళ్లే ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాలు నీటిలో నుంచి వెళ్లాల్సి రావడంతో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని పలువురు వాపోతున్నారు.


 ఐదేళ్లుగా సమస్య.. పరిష్కారం మాత్రం శూన్యం


నాయకన్‌గూడెం నుంచి పలు గ్రామాలకు, ఇతర ప్రాంతాలకు, మరో జిల్లాకు వెళ్లే ప్రజలకు ఈ మార్గం కీలకమైనది. నిత్యం అనేక వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అలాంటి ప్రధాన మార్గంలో వర్షం పడిన ప్రతిసారీ నీరు నిలిచిపోతున్నా ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం చూపకపోవడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయి సుమారు 5 సంవత్సరాలు అవుతున్నా.. వర్షపు నీరు నిలిచే సమస్యను అధికారులు ఎందుకు పరిష్కరించలేకపోతున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిర్మాణ సమయంలోనే వర్షపు నీటి పారుదల వ్యవస్థను సక్రమంగా ఏర్పాటు చేశారా? లేక ఏర్పాటు చేసిన వ్యవస్థ నిర్వహణ లోపంతో పనిచేయడం లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అధికారుల దృష్టి ఎక్కడ?


ప్రతి వర్షాకాలంలో సమస్య పునరావృతమవుతున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడమే తమకు ప్రధాన ఆవేదనగా ఉందని వాహనదారులు చెబుతున్నారు. బ్రిడ్జి కింద నీరు నిలిచిపోవడం కొత్త సమస్య కాదని, గతంలోనూ ఇదే పరిస్థితి ఎదురైందని వారు పేర్కొంటున్నారు. “ప్రజలు నిత్యం ఈ రహదారిపై ప్రయాణిస్తూ ఇబ్బందులు పడుతున్నా అధికారులు శాశ్వత పరిష్కారం ఎందుకు చూపడం లేదు?” అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.


తాత్కాలిక చర్యలు కాదు.. శాశ్వత పరిష్కారం కావాలి


వర్షం తగ్గిన తర్వాత నీరు వెళ్లిపోవడం సమస్యకు పరిష్కారం కాదని స్థానికులు అంటున్నారు. మళ్లీ వర్షం పడితే అదే పరిస్థితి పునరావృతం కాకుండా బ్రిడ్జి కింద నీటి పారుదల వ్యవస్థను పూర్తిస్థాయిలో పరిశీలించి అవసరమైన పనులు చేపట్టాలని కోరుతున్నారు. జాతీయ రహదారి అధికారులు స్థలాన్ని పరిశీలించి, నీరు ఎందుకు నిలుస్తుందో సాంకేతికంగా గుర్తించి, శాశ్వత డ్రైనేజీ/నీటి పారుదల పరిష్కారం చేపట్టాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.


నిర్లక్ష్యం కొనసాగితే మరిన్ని ఇబ్బందులు తప్పవు


ఇప్పటికే ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అధికారులు ఇకనైనా స్పందించకపోతే ఈవర్షాకాలంలో ప్రయాణికులకు ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల రాకపోకలకు కీలకమైన రహదారిలో 5 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ సమస్యపై జాతీయ రహదారి అధికారులు ఇప్పటికైనా స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని నాయకన్‌గూడెం, పరిసర గ్రామాల ప్రజలు కోరుతున్నారు.


 ఎన్ హెచ్ ఎ ఐ సైట్ ఇంజనీర్ కార్తీక్ వివరణ


 నేషనల్ హైవే నాయకన్ గూడెం బ్రిడ్జి క్రింద నుండి వస్తున్న నేరు ఇతర పొలాల్లో చెరువుల్లో నుండి వస్తున్న నీరు. అచ్చంగా వర్షానికే పడిన నీరే రోడ్డుమీద నిలిచినట్లయితే ఎన్ హెచ్ ఏఐ అధికారులు బాధ్యత వహిస్తారు కానీ స్థానిక ప్రజలు పొలాల్లో ఉన్న నీటిని చెరువులో నీటిని రోడ్డుమీదికి మళ్ళిస్తున్నందున దానికి మేము బాధ్యత వహించలేము అని తెలిపారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم