బస్సులో 45 మంది ప్రయాణికులు.. ఒక్కసారిగా పొగలు రావడంతో ఆందోళన
ప్రజాపక్షం /వైరా: ఖమ్మం జిల్లాకొనిజర్ల మండలం పల్లిపాడు సమీపంలోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద cg10కు888 హైదరాబాదు నుంచి పలాస వెళ్తున్న శ్రీ మణికంఠ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురైన ఘటన ఆదివారం రాత్రి ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం పల్లిపాడు సమీపంలో చోటుచేసుకుంది. కొనిజర్ల మండలం పల్లిపాడు సమీపంలోని స్వర్ణ భారతి కోల్డ్ స్టోరేజ్–భారత్ పెట్రోల్ బంక్ వద్దకు బస్సు చేరుకోగానే ఒక్కసారిగా పొగలు రావడాన్ని డ్రైవర్ గమనించాడు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రహదారి పక్కకు నిలిపి, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాడు. దీంతో బస్సులో ఉన్న సుమారు 45 మంది ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.పొగలు రావడంతో బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి