ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

పీటీపై పోక్సో కేసు నమోదు.. రిమాండ్‌కు తరలింపు



జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఏర్పాటైన కమిటీ లోను అసభ్యకర ప్రవర్తన గుర్తింపు

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న గుదిమల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీఈటీపై పోలీసులు శనివారం పోక్సో కేసు నమోదు చేశారు.  చోటుచేసుకున్న ఈ ఘటనపై విద్యార్థినుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు, ప్రాథమిక విచారణలో వెలుగుచూసిన అంశాల ఆధారంగా పీఈటీపై పోక్సో చట్టంతో పాటు ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ అనంతరం న్యాయస్థానంలో హాజరపరచనున్నారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు నిందితుడిని రిమాండ్‌కు తరలించనున్నట్లు తెలిసింది.


జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కమిటీ..


ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఆదేశాలతో డీఈఓ సూచనల మేరకు ఓ కమిటీని కూడా నియమించారు. ఈ కమిటీ ద్వారా విచారణ జరిపిన సదరు కమిటీ సభ్యులు విద్యార్థులు పట్ల జరిగిన అనుచిత ప్రవర్తన వాస్తవమేందనే నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. అలాగే సంబంధిత తుది నివేదికను కూడా కలెక్టర్కు అందజేసినట్లు సమాచారం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది