ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

శ్రీ చైతన్య ఆధ్వర్యంలో..తల్లంపాడులో ఉచిత నేత్ర వైద్య శిబిరం



 

130 మందికి కంటి పరీక్షలు.. అవసరమైన వారికి ఉచిత మందులు


శస్త్రచికిత్స అవసరమైన వారికి ఆసుపత్రికి రిఫర్


ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల (SCIT), ఖమ్మం జాతీయ సేవా పథకం (NSS) ఆధ్వర్యంలో మ్యాక్స్ విజన్ ఐ హాస్పిటల్ సహకారంతో తల్లంపాడు గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 130 మంది గ్రామస్తులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు అందించడంతోపాటు శస్త్రచికిత్స అవసరమైన వారిని తదుపరి చికిత్స కోసం ఆసుపత్రికి రిఫర్ చేశారు.  సర్పంచ్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడం సామాజిక బాధ్యతలో భాగమన్నారు. విద్యార్థులు NSS ద్వారా సేవాభావాన్ని అలవర్చుకుని సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని సూచించారు. కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సాయి గీతిక మాట్లాడుతూ NSS ‘Not Me But You’ స్ఫూర్తితో విద్యార్థులు సమాజ సేవలో చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు. ఇలాంటి ఆరోగ్య శిబిరాలు ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంచడంతోపాటు విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను మరింత బలోపేతం చేస్తాయని అన్నారు. కార్యక్రమంలో కళాశాల డీన్ డాక్టర్ వి. సుదర్శన్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వైశాలి, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్, డిప్లొమా ఇన్‌చార్జి కృష్ణ ప్రసాద్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ నరేష్, NSS వాలంటీర్లు, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది