ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

సింహాద్రి నగర్‌లో ఘనంగా కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం



 ప్రజాపక్షం/ఖమ్మంరూరల్: ఎదులాపురం మున్సిపాలిటీ 32వ వార్డు సింహాద్రి నగర్‌లో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను వార్డు కౌన్సిలర్ మామిండ్ల శ్రీనాథ్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఖమ్మం జిల్లా కార్యదర్శి దండి సురేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీ ప్రజలకు సామూహిక కార్యక్రమాలు, సమావేశాలు, శుభకార్యాలు నిర్వహించుకోవడానికి కమ్యూనిటీ హాల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. వార్డు కౌన్సిలర్ మామిండ్ల శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ సింహాద్రి నగర్ ప్రజలకు కమ్యూనిటీ హాల్ అందుబాటులోకి రావడం సంతోషకరమని, వార్డులో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. అనంతరం కాలనీ ప్రజలు దండి సురేష్ గారిని, వార్డు కౌన్సిలర్ మామిండ్ల శ్రీనాథ్ రెడ్డి గారిని శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు యుగంధర్, సత్యనారాయణ, నారాయణరెడ్డి, నారాయణరావు, దారం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم