ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

తాతా మధుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి


 ఎదులాపురం మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు బానోతు కిషోర్ నాయక్

వరంగల్ క్రాస్‌రోడ్‌లో దిష్టిబొమ్మ దగ్ధం

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న దళిత స్పీకర్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఎదులాపురం మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు బానోతు కిషోర్ నాయక్ డిమాండ్ చేశారు. తాతా మధు వ్యాఖ్యలను నిరసిస్తూ సోమవారం వరంగల్ క్రాస్‌రోడ్ చౌరస్తాలో మున్సిపాలిటీ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కిషోర్ నాయక్ మాట్లాడుతూ.. దళితుల పట్ల బీఆర్‌ఎస్ నాయకత్వం మొదటి నుంచి వివక్షపూరిత వైఖరిని అవలంబిస్తోందని ఆరోపించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్, ఆ హామీని నిలబెట్టుకోకుండా దళిత సమాజాన్ని మోసం చేశారని విమర్శించారు. దళిత వ్యక్తి రాజ్యాంగబద్ధమైన అత్యున్నత స్థానాల్లో ఒకదానిలో ఉండటాన్ని కూడా జీర్ణించుకోలేక కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ రాజ్యాంగ పదవులను, వాటిలో ఉన్న వ్యక్తులను గౌరవించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని కిషోర్ నాయక్ స్పష్టం చేశారు. తాతా మధు చేసిన వ్యాఖ్యలపై సమగ్రంగా విచారణ జరిపి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. అనంతరం తాతా మధుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరుతూ ఖమ్మం రూరల్ పోలీసులకు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, కౌన్సిలర్లు బానోతు దివ్య ప్రసాద్, సామా వెంకటరెడ్డి, మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు తోట చిన్న వెంకటరెడ్డి , భూక్య సురేష్ నాయక్, వెంపటి రవి, వెంపటి సురేష్, గణప వీరన్న, మోహన్ రెడ్డి, అశోక్ రెడ్డి , రాకేష్ రెడ్డి, కందుకూరి వెంకటనారాయణ, మేళ్లచెరువు సురేష్, ఏపూరి తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم