ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఆస్తి కోసం తమ్ముడి హత్య.. అన్నకు జీవిత ఖైదు


 

తండ్రి ఆస్తి విషయంలో వివాదం..కర్రతో దాడి చేసి హతమార్చిన అన్న

2022 నాటి హత్య కేసులో న్యాయస్థానం తీర్పు

ప్రజాపక్షం / నేలకొండపల్లి : తండ్రి ఆస్తి విషయంలో తలెత్తిన వివాదం చివరకు సొంత తమ్ముడి హత్యకు దారితీసింది. ఆస్తి కోసం తమ్ముడిపై కర్రతో దాడి చేసి హత్య చేసిన అన్నకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఈ మేరకు బుధవారం న్యాయమూర్తి శీనయ్య తీర్పు వెలువరించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువుమాధారం గ్రామానికి చెందిన రెడ్డిబోయిన నాగరాములు అలియాస్ నాగరాజు, అతని తమ్ముడు రెడ్డిబోయిన రామలింగం మధ్య తండ్రి ఆస్తి విషయంలో కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో 2022 జూన్‌ 9న ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గొడవ తీవ్రరూపం దాల్చడంతో కోపోద్రిక్తుడైన నాగరాములు కర్రతో తమ్ముడు రామలింగంపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన రామలింగం మృతిచెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య సరోజ ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై స్రవంతి కేసు నమోదు చేశారు. అనంతరం కూసుమంచి సీఐ సతీష్ కేసు దర్యాప్తు చేపట్టారు. హత్యకు సంబంధించిన ఆధారాలను సేకరించి నిందితుడిపై న్యాయస్థానంలో చార్జిషీట్‌ దాఖలు చేశారు. కేసుపై న్యాయస్థానంలో జరిగిన విచారణ పూర్తయిన అనంతరం నిందితుడు నాగరాములు తమ్ముడు రామలింగాన్ని హత్య చేసినట్లు నిర్ధారణ కావడంతో జీవిత ఖైదు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి శీనయ్య బుధవారం తీర్పు వెల్లడించారు. కేసు విచారణలో కానిస్టేబుల్‌ ఎం. రామారావు బాధ్యతగా వ్యవహరించారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم