ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ప్రజాపక్షం వార్తకు స్పందన.. మిషన్‌ భగీరథ పైపులైన్‌ లీకేజీకి మరమ్మతులు ప్రారంభం




 

ప్రజాపక్షం/కూసుమంచి : కూసుమంచి మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ సమీపంలో *గత ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న మిషన్‌ భగీరథ తాగునీటి పైపులైన్‌ లీకేజీ* సమస్యపై ‘ప్రజాపక్షం’లో శనివారం ప్రచురితమైన వార్తకు మిషన్ భగీరథ అధికారులు స్పందించారు. వార్త ప్రచురితమైన అనంతరం సంబంధిత మిషన్‌ భగీరథ అధికారులు సమస్యను పరిశీలించి, గురువారం లీకేజీకి శాశ్వత పరిష్కారం కల్పించే పనులను ప్రారంభించారు. లీకేజీ కారణంగా రహదారిపై నీరు నిలిచి దుకాణదారులు, వాహనదారులు, స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని వార్తలో ప్రస్తావించారు.


ప్రజలకు ఇబ్బందులు తప్పే అవకాశం


ఎనిమిది నెలలుగా లీకవుతున్న పైపులైన్‌ కారణంగా తాగునీరు వృథా కావడంతో పాటు రహదారి పక్కన బురద, గుంతలు ఏర్పడి ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రస్తుతం అధికారులు యంత్రాలతో తవ్వకాలు చేపట్టి లీకేజీకి కారణమైన పైపులైన్‌ను గుర్తించి మరమ్మతు పనులు చేపడుతున్నారు.


వార్తపై స్పందించిన అధికారులకు కృతజ్ఞతలు


ప్రజా సమస్యను వెలుగులోకి తీసుకురావడంతో అధికారులు స్పందించి పనులు ప్రారంభించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ‘ప్రజాపక్షం’కు, సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టిన మిషన్‌ భగీరథ అధికారులకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم