ప్రత్యేక పూజలు.. కేక్ కట్ చేసిన బీజేపీ నాయకులు
ప్రజాపక్షం / నేలకొండపల్లి: భారతీయ జనతా పార్టీ నేలకొండపల్లి మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చావా కిరణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు సాధిస్తోందన్నారు. మోదీ నాయకత్వంలో దేశ ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తున్నారని పేర్కొన్నారు. మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి లింగనబోయిన వెంకటేశ్వర్లు, మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకుడు ఎస్కే షరీఫుద్దీన్, బీజేపీ నాయకులు మల్లెబోయిన గోవిందరావు, బాజా రామకృష్ణ, కిసాన్ మోర్చా మండల కన్వీనర్ సూరేపల్లి జ్ఞానరత్నం, పురాణం దివాకర్, కొండ హర్షవర్ధన్, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు కందరబోయిన వెంకటరమణ, సురేపల్లి అనసూర్య, తుపాకుల సంజన, రాయల మురళీకృష్ణ, పిట్టల సూరిబాబు, నేలకొండపల్లి బీజేపీ సోషల్ మీడియా మండల ఇన్చార్జి కందరబోయిన గోపీ తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق