ఎం.వెంకటాయపాలెంలో కీలక రాజకీయ పరిణామం
పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన మంత్రి పొంగులేటి
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలం ఎం.వెంకటాయపాలెం గ్రామంలో రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. సీపీఎంకు పట్టున్న గ్రామంగా గుర్తింపు ఉన్న ఎం.వెంకటాయపాలెం మాజీ సర్పంచ్ తుమ్మల సురేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో గ్రామ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు ఈ చేరిక వేదికగా మారింది.ఖమ్మం నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో తుమ్మల సురేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆయనకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోట వీరభద్రం, మద్దులపల్లి మార్కెట్ చైర్మన్ బైరి హరినాథ్‌బాబు, ఖమ్మం మార్కెట్ మాజీ చైర్మన్ మద్ది మల్లారెడ్డి, మద్ది వీరారెడ్డి, మద్ది కిషోర్‌రెడ్డి, సర్పంచ్ కుమ్మరి అంబేద్కర్, సర్పంచ్ పాపా నాయక్, ప్రతాపనేని రఘు, గుండు నాగేశ్వరరావు, బుర్ర రాజేష్, టీమ్ పొంగులేటి పీఎస్ఆర్ సోషల్ మీడియా వారియర్ ఆరెంపుల బద్రిసాయి తదితరులు పాల్గొన్నారు.
తుమ్మల సురేష్ జాయినింగ్ తో ప్రాధాన్యత
మాజీ సర్పంచ్‌గా గ్రామస్థాయిలో పరిచయం ఉన్న తుమ్మల సురేష్ కాంగ్రెస్‌లో చేరడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ చేరికకు ప్రాధాన్యత ఏర్పడింది. కాంగ్రెస్ బలోపేతానికి గ్రామస్థాయిలో రాజకీయంగా ప్రాధాన్యత ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ చేరికతో ఎం.వెంకటాయపాలెంలో తుమ్మల సురేష్ కు స్థానికంగా కాంగ్రెస్ కార్యకలాపాలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.

إرسال تعليق