ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

అన్నదానం మహాదానం...


 మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయం ఇన్‌చార్జి తుంబూరు దయాకర్‌రెడ్డి

దైవభక్తిని చాటుతున్న మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కిషోర్ సేవాగుణం

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి, అలాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల్లో అన్నదానం నిర్వహించడం మరింత గొప్ప విషయమని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయం ఇన్‌చార్జి తుంబూరు దయాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 26వ వార్డులో మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు బానోతు కిషోర్ నాయక్ ఆధ్వర్యంలో గణపతి, అయ్యప్ప మాలధారులకు ఏర్పాటు చేసిన నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. తొలుత కిషోర్ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని దయాకర్‌రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భక్తిశ్రద్ధలతో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు గణేష్, అయ్యప్ప మాలధారులకు నిత్య అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. కిషోర్ నాయక్ చేపట్టిన సేవా కార్యక్రమాన్ని ప్రత్యేకంగా అభినందించారు.


కిషోర్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మికంగా...


సాధారణంగా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి అన్నదానం నిర్వహించడం ఆనవాయితీగా ఉంటుంది. అయితే దైవభక్తుడైన కిషోర్ నాయక్ తన ప్రత్యేకతను చాటుకుంటూ గణేష్, అయ్యప్ప మాలధారులకు నిత్య అన్నదానం ఏర్పాటు చేయడం విశేషంగా నిలిచింది. ప్రతిరోజూ సుమారు 200 మందికి పైగా భక్తులకు అన్నదానం చేయడం ద్వారా భక్తితో పాటు సేవా స్ఫూర్తిని చాటుతున్నారని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీ క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్ కొప్పుల చంద్రశేఖర్, చైర్‌పర్సన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్లు సామ వెంకట్‌రెడ్డి, బానోతు ప్రసాద్, భానోత్ దివ్య తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم