ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

వెంకట సాయి సుధా నగర్‌లో విరిసిన ఆధ్యాత్మిక శోభ



 శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదానం

ప్రారంభించిన సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్:  ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డు ఐదవ వీధిలోని వెంకట సాయి సుధా నగర్‌లో శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుని వద్ద ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, 28వ వార్డు సీపీఐ కౌన్సిలర్ దండి రంగారావు, 30వ వార్డు సీపీఐ కౌన్సిలర్ దండి శ్రీజ ప్రారంభించారు. అంతకుముందు ఉత్సవ కమిటీ సభ్యులు వారికి వినాయకుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమానికి కాలనీవాసులతో పాటు చుట్టుపక్కల కాలనీలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అన్నదానాన్ని స్వీకరించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమం స్థానికంగా ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకుడు వెంపటి రాము, జిల్లా సమితి సభ్యులు గోపి, చింతల ఉదయ్, శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم