వెలుగులు నింపిన మహిళల దీపోత్సవం,మాలాదారులకు ప్రత్యేకంగా అల్పాహారం అందజేత
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 26వ వార్డు గిస్కానగర్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. సమైక్యత గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు గిస్కా కృష్ణ సౌజన్యంతో మహిళలు భక్తిశ్రద్ధలతో దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపాలను వెలిగించడంతో గిస్కానగర్ ఆధ్యాత్మిక వెలుగులతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అదేవిధంగా స్వామి మాలలు ధరించిన మాలాదారుల కోసం ప్రత్యేకంగా అల్పాహారాన్ని ఏర్పాటు చేసి వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో స్వామి మాలను ధరించిన టీఆర్ఎస్ నాయకుడు బానోతు వీరన్న పాల్గొని అల్పాహార వితరణలో భాగస్వాములయ్యారు. భక్తులు, మహిళలు, మాలాదారుల సందడితో గిస్కానగర్లో పండుగ వాతావరణం నెలకొంది.


إرسال تعليق