ప్రజాపక్షం/చింతకాని : మామపై అల్లుడు గొడ్డలితో దాడి చేసిన ఘటన చింతకాని మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని లచ్చగూడెం గ్రామానికి చెందిన షేక్ ఉద్దండు సాహెబ్ తన కూతురుకు అదే గ్రామానికి చెందిన తన తన మేనల్లుడైన షేక్ మీరాసాహెబ్ కి ఇచ్చి వివాహం జరిపించాడు. మీరాసాహెబ్, అతని భార్యకు మధ్య విభేదాలు రావడంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. కూతురును కాపురానికి పంపే విషయమై భార్య తండ్రి ఉద్దండ్ సాహెబ్ అభ్యంతరం చెప్తున్నాడని ఆగ్రహంతో మీరాసాహెబ్ శనివారం భార్య పుట్టింటికి వెళ్లి మామపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో ఉద్దండు సాహెబ్ కు గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం ఖమ్మం ఆనుపత్రికి తరలించారు.
మామపై అల్లుడు గొడ్డలితో దాడి
byThe News Desk
-
0

إرسال تعليق