ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

వ్యాయామ టీచర్ కీచక పర్వం



 

వ్యాయామ టీచర్‌పై తల్లిదండ్రుల ఆందోళన

 స్పోర్ట్స్ నేర్పించే పేరుతో విద్యార్థులను ఒంటరిగా గదిలోకి పిలిచారని ఆరోపణ

 గుదిమల్ల జిల్లా పరిషత్ పాఠశాల ఎదుట ఉద్రిక్తత


ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గుదిమల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న షేక్ షఫీ అహ్మద్ విద్యార్థుల పట్ల అనుచితంగా వ్యవహరించారంటూ కొందరు తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. స్పోర్ట్స్ నేర్పించే పేరుతో విద్యార్థులను ఒంటరిగా గదిలోకి పిలిచి, వారితో అసభ్యకరంగా మాట్లాడినట్లు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని వారు కోరారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ శ్రీనివాస్ పాఠశాలకు చేరుకుని తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు స్వీకరించినట్లు తెలిసింది.  ఆందోళన నేపథ్యంలో పోలీసులు సైతం పాఠశాల వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫిర్యాదు ఆధారంగా సంబంధిత అధికారులు తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలిసింది.


 పాఠశాలకు సెలవు పెట్టిన పీఈటీ


తల్లిదండ్రులు చేసిన ఆరోపణల నేపథ్యంలో సదరు పీఈటీ పాఠశాలకు సెలవు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఘటనపై వివరణ ఇవ్వాల్సిన సమయంలో ఆయన పాఠశాలకు హాజరు కాకపోవడంపై తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినుల పట్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న తీరుపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని వారు కోరుతున్నారు. పీఈటీ సెలవు పెట్టడానికి అసలు కారణం ఏమిటన్నది కూడా చర్చకు దారితీస్తోంది. అయితే ఆరోపణల్లో వాస్తవమెంత అన్నది సంబంధిత అధికారులు, పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

 

ఘటనపై నిఘా వర్గాల ఆరా..


పాఠశాలలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై నిఘా వర్గాలు ఆరా తీసినట్లు సమాచారం. పాఠశాల పరిసరాలను పరిశీలించి, ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు చేరవేసినట్లు తెలిసింది.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم