ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

గిస్కానగర్‌లో విరిసిన ఆధ్యాత్మిక శోభ




 



శ్రీ సమైక్యత గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా మహా అన్నదానం

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 26వ వార్డు గిస్కానగర్‌లో శ్రీ సమైక్యత గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మహా అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. బిఆర్ఎస్ జిల్లా నాయకుడు బానోత్ కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు, స్థానిక కాలనీవాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా నాయకురాలు బానోతు చంద్రావతి, మాజీ ఎంపీపీ బెల్లం ఉమా, సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మొహమ్మద్ మౌలానా, సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ ముఖ్య అతిథులుగా హాజరై మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.అంతకుముందు వినాయకుడి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ముఖ్య అతిథులను శాలువాలతో కమిటీ ఆధ్వర్యంలో సత్కరించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమం భక్తి, ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాదాన్ని అందించడంతో గిస్కానగర్‌లో పండుగ వాతావరణం తో పాటు కాలనీ మొత్తం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. భక్తులు, స్థానికులు ఉత్సాహంగా పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సమైక్యత గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, నాయకులు, భక్తులు, స్థానిక కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم