ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఘనంగా ఏఐవైఎఫ్ జిల్లా కౌన్సిల్ నెంబర్ చింతల ఉదయ్ జన్మదిన వేడుకలు

ప్రజాపక్షం / ఖమ్మం రూరల్: ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డుకు చెందిన సీపీఐ అనుబంధ సంఘమైన ఏఐవైఎఫ్ జిల్లా కౌన్సిల్ మెంబర్ చింతల ఉదయ్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక నివాసంలో నిర్వహించిన ఈ వేడుకలకు ఏఐవైఎఫ్ యువజన సంఘం సభ్యులు, ఉదయ్ స్నేహితులు హాజరయ్యారు.ఈ సందర్భంగా చింతల ఉదయ్ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అనంతరం యువజన సంఘం సభ్యులు, స్నేహితులు ఉదయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యలపై చురుకుగా స్పందిస్తూ యువతను సంఘటితం చేయడంలో ఉదయ్ మరింత ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు. ఉదయ్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, యువత సమస్యలపై మరింత చురుకుగా పోరాడుతూ ప్రజా ఉద్యమాల్లో తనదైన ముద్ర వేయాలని వారు ఆకాంక్షించారు. వేడుకల సందర్భంగా స్నేహితులు, యువజన సంఘం సభ్యుల మధ్య సందడి నెలకొంది.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم