డిపో మేనేజర్ ప్రైవేట్ డ్రైవర్ల పై అనుచిత వ్యాఖ్యలకు డిపో కే పరిమితమైన 54 సర్వీసులు
ప్రైవేట్ బస్సులో డ్రైవర్లతో చర్చలు జరుపుతున్న సత్తుపల్లి డిపో డిఎం
ప్రజాపక్షం/సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపో పరిధిలోని ప్రైవేట్ బస్సుల డ్రైవర్ల మెరుపు సమ్మె గురువారం ఉదయం తెల్లవారుజాము నుంచి కొనసాగుతుంది. సత్తుపల్లి డిపో మేనేజర్ ప్రైవేట్ బస్సుల డ్రైవర్ పట్ల అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ప్రయాణికుల చిన్న చిన్న ఫిర్యాదులతో అ కారణంతో డ్రైవర్లకు డ్యూటీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తూ 54 .సర్వీసుల డ్రైవర్లు బస్సులు నిలిపివేసి ఆందోళనకు దిగారు. దీంతో గురువారం ఉదయం తెల్లవారుజాము నుంచి 54 సర్వీసులు డిపోకే పరిమితమయ్యాయి. ప్రైవేట్ డ్రైవర్ల మెరుపు సమ్మెతో దిగివచ్చిన డిపో మేనేజర్ సత్యనారాయణ ఆర్టీసీ ప్రైవేట్ బస్ డ్రైవర్లతో చర్చలు జరుపుతున్నారు. దగ్గరలో వినాయక చవితి పండగ ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి 54 సర్వీసులు నిలిచిపోవడంతో కండక్టర్లు డ్రైవర్లు డిపోకే పరిమితమయ్యారు దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. డిపో మేనేజర్ డ్రైవర్లతో చర్చలు జరిపారు. డ్రైవర్లు పలు డిమాండ్లను డిఎం ముందుంచగా వాటికి సానుకూల స్పందన రావడంతో డ్రైవర్లు సమ్మె విరమించారు డ్రైవర్ల సమ్మెకు ఆయా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.

إرسال تعليق