ఇందిరమ్మ కాలనీ, వెంకటగిరిలో నిర్మాణాలు నేలమట్టం
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ, వెంకటగిరి ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు గురువారం కొరడా ఝుళిపించారు. ఖమ్మం రూరల్ తహసీల్దార్ వినయేందర్ రెడ్డి ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలను జేసీబీలతో తొలగించారు. ఆర్ఐ జానీ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను జేసీబీల సహాయంతో నేలమట్టం చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. అదేవిధంగా 142 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిని గుర్తిస్తూ హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో భాగంగా ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీపీఓలు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


إرسال تعليق